టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. నిన్న ఐపీఎల్లో భాగంగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లో ఒక ఫోర్, 7 సిక్సర్లు బాదిన ధోనీ 70 పరుగులు చేశాడు. ఫలితంగా ధోని ఖాతాలోకి 5వేల పరుగులు వచ్చి చేరాయి.
టీ20ల్లో 5వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్గా ధోనీ రికార్డు సృష్టించాడు. 36 ఏళ్ల ధోనీ టీ20ల్లో మొత్తం 5,786 పరుగులు చేయగా, అందులో 5,010 పరుగులు టీ20 కెప్టెన్గా చేసినవే.
ఇంతకముందు 2012లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ చెన్నై జట్టు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఒక సీజన్లో 200 పరుగులకు పైగా విజయ లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 203 పరుగులను సాధించిన ధోనీ జట్టు తాజాగా 206 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. గతంలో డెక్కన్ చార్జర్స్ ఈ ఘనత సాధించింది.