Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెంటిమెంట్ ఫాలో అయిన ధోని

Category : sports

టీం ఇండియా మాజీ సారధి ధోని ఐపియల్ విజయం తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. జట్టు ప్రదర్శన ఒక కారణమైతే తన మునుపటి ఫాం ని అందుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటె ముంబయిలోని వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో ట్రోఫీ దక్కించుకున్న అనంతరం ధోనీ జట్టు తిరిగి చెన్నై చేరుకుంది.అక్కడ ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందులో జట్టు సభ్యలు పాల్గొన్నారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవారి ఆలయంలో ట్రోఫీకి పూజలు కూడా నిర్వహించారు.

ట్రోఫీ దక్కించుకున్న అనంతరం ధోనీ ఎక్కడికి వెళ్లి ఉంటాడన్న విషయంపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే... చెన్నైలో విందు కార్యక్రమాల అనంతరం ధోనీ తన స్వస్థలం రాంచీ చేరుకున్నాడు. ఆ తర్వాత రాంచీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అమ్మవారి ఆలయానికి వెళ్లి దుర్గామాతను దర్శించుకున్నాడు. ఆలయంలో ధోనీని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. ధోనీకి ఓ సెంటిమెంట్‌ ఉంది. ఏదైనా టోర్నీలో పాల్గొనే ముందు, టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటాడట.

Related News