ఈ నెల 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.
అయితే మొహాలీలో జరగనున్న రెండో వన్డే తర్వాత ధోనీ రిటైర్ అవనున్నాడు. ధోనీ ఏంటి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడమేంటని అనుకుంటున్నారా. అయితే ఇక్కడ రిటైర్ అవుతుంది భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ధోనీ కాదు. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న శునకం.
ఈ సందర్భంగా డాగ్ స్కాడ్ ఇన్‌ఛార్జి అమ్రిక్ సింగ్ మాట్లాడుతూ… మూడు నెలల వయసులో ధోనీ మా వద్దకు వచ్చింది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. పగలుపూట ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే నిద్రపోయే ధోనీ ఎంతో చురుకుగా ఉంటది.
ధోని గ్రౌండ్లో విజృంభిస్తే ఈ ధోనీ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 2011 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు ధోనీ విధుల్లో పాల్గొంది. డిసెంబర్ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈ శునకానికి రిటైర్మెంట్ ప్రకటిస్తాం. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట.