//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో రెండు ప్రపంచ రికార్డులు అందుకోనున్న ధోని !

Category : sports

టీమిండియా మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఇప్ప‌టికే త‌న పేరిట ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న `మిస్ట‌ర్ కూల్ ' ఎమ్మెస్ ధోనీ ఇప్పుడు ప్లేయ‌ర్‌గా మ‌రో రెండు ప్ర‌పంచ రికార్డులకు ద‌గ్గ‌ర్లో ఉన్నాడు. శ్రీలంక‌తో గురువారం జ‌ర‌గ‌బోయే నాలుగో వ‌న్డేలోనే ఆ రికార్డులు అందుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నట్లు భావిస్తున్నారు. 

ఇది ధోనీకి 300వ వ‌న్డే కానుండ‌టం మ‌రో విశేషం. ఈ మ్యాచ్‌లో మ‌రొక్క స్టంపింగ్ చేస్తే చాలు వ‌న్డేల్లో అత్య‌ధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీప‌ర్‌గా వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు ధోనీ. ప్ర‌స్తుతం 99 స్టంపింగ్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీప‌ర్ సంగ‌క్క‌ర‌తో స‌మానంగా ఉన్నాడు ధోనీ. 

అటు బ్యాట్స్‌మ‌న్‌గా మ‌రో రికార్డు ధోనీని ఊరిస్తున్న‌ది. మ‌రొక్కసారి అత‌ను నాటౌట్‌గా నిలిస్తే చాలు. వ‌న్డేల్లో అత్య‌ధికసార్లు నాటౌట్‌గా ఉన్న రికార్డు కూడా సొంత‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం 72 నాటౌట్‌ల‌తో ధోనీ షాన్ పొలాక్‌, చ‌మిందా వాస్‌ల‌తో స‌మానంగా నిలిచాడు.  గత నెలలో ఇంగ్లాండ్ లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ తో పాటు వరుసగా పలు మ్యాచ్ లలో సరైన ప్రతిభ చూపలేని ధోనిని 2019లో జరిగే ప్రపంచ కప్ కు టీమ్ లో కొనసాగించనవసరం లేదంటూ వాఖ్యలు వెలువడుతున్నాయి. దానితో శ్రీలంకతో  సిరీస్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నాడు. 

ఇక్కడ కూడా సరిగ్గా ఆడక పోతే ప్రపంచ కప్ లో పాల్గొనడం అనుమానమే అనుకొంటున్న సమయంలో గత రెండు  మ్యాచుల్లో టీమ్‌ను గెలిపించి త‌న అనుభ‌వం ఎంత ముఖ్య‌మో నిరూపించాడు. ముఖ్యంగా రెండో వ‌న్డేలో ఆశ‌లన్నీ వ‌దిలేసుకున్న స‌మ‌యంలో టెయిలెండ‌ర్ భువీతో క‌లిసి అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వ‌న్డేలోనూ రోహిత్‌తో క‌లిసి టీమ్‌ను గెలిపించాడు. తన అవసరం టీమిండియా కు యెంతగానో ఉన్నాడని గుర్తించేటట్లు చేసుకున్నాడు. 

అంతేకాదు ఈ సిరీస్‌లోనే టీమిండియా త‌ర‌ఫున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మ‌న్‌గానూ ధోనీ నిలిచాడు. 299 మ్యాచుల్లో 9608 ర‌న్స్ చేశాడు ధోనీ. కేవ‌లం స‌చిన్ (18426), గంగూలీ (11221), ద్ర‌విడ్ (10768) మాత్ర‌మే ధోనీ క‌న్నా ముందున్నారు. టాప్ ఫైవ్‌లోనూ యావ‌రేజ్ (51.55), స్ట్రైక్ రేట్ (87.99) ప‌రంగా వీళ్లంద‌రి క‌న్నా ధోనీ ముందున్నాడు.