//single page style gallary page

Dhoni set a new world record

Category : sports

Click here to read this article in Telugu

ధోనీ సరికొత్త వరల్డ్ రికార్డు

లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. సుధీర్ఘకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న మహీ.. వికెట్‌ కీపర్‌గా ఏకంగా 350 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇందులో ధోనీ 3 మ్యాచ్‌ల్లో ఆసియా ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. మిగిలిన 347 టీమ్ ఇండియా తరఫున ఆడాడు. ఓవరాల్‌గా 350 వన్డేలాడిన పదో క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిస్టర్‌కూల్ ఈ ఘనత అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్(463) తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ మహీనే కావడం విశేషం. మొత్తం 350 వన్డేల్లో 200 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఓవరాల్‌గా రికార్డు స్థాయిలో వన్డేలకు సారథ్యం వహించిన మూడో క్రికెటర్ ధోనీ కాగా భారత్ నుంచి ఏకైక ఆటగాడు మహీనే కావడం విశేషం. శ్రీలంక మాజీ కీపర్‌ సంగక్కర 404 వన్డేలు ఆడినా అందులో 44 మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగాడు. ధోనీ మాత్రం కెరీర్‌ మొత్తం కీపర్‌గానే కనిపించాడు. అత్యధిక వన్డేలాడిన ఈ జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. జయవర్ధనే (448), సనత్ జయసూర్య (445), కుమార సంగక్కర (404), షాహిదీ అఫ్రిది (398), ఇంజమామ్ ఉల్ హక్‌(378), రికీ పాంటింగ్‌ (375), వసీం అక్రమ్‌ (356), ముత్తయ్య మురళీధరన్‌ (350) ముందున్నారు.

London : Former India captain Mahendra Singh Dhoni has achieved a rare feat. Mahi, the longest-serving wicket-keeper in international cricket, has made history by becoming the first cricketer to score 350 ODIs. Dhoni represented the Asian Eleven in 3 matches and played for the remaining 347 Team India . Dhoni became the tenth cricketer to hit 350 ODIs. Mr Cool was awarded the match in the first semifinal match against New Zealand as part of the World Cup. He is the second cricketer to achieve this feat after Sachin Tendulkar (463). Dhoni captained 200 matches in all 350 ODIs.

Overall, as a record level in the third One-day cricketer, Dhoni has captained India has been the only player mahine. Former Sri Lanka keeper Sangakkara played 404 ODIs and became a specialist batsman in 44 matches. Dhoni has been the keeper of his entire career. While Sachin is at the top of the list of ODIs , Jayawardene (448), Sanath Jayasuriya (445), Kumara Sangakkara (404), Shahidi Afridi (398), Inzamm ul Haq (378), Ricky Ponting (375) and Wasim Akram (35). And Muttiah Muralitharan (350).