ఒక చిన్న ప్రాంతం నుంచి తన క్రికెట్ జీవితం మొదలు పెట్టిన ధోని తన అసాధారణ నాయకత్వ పటిమతో భారత క్రికెట్ ని పతాక స్థాయికి తీసుకొని వెళ్లిన అసామాన్యుడు. క్రికెట్ క్రీడ పట్ల తన కి ఉన్న అంకిత భావం గురించి ఎమెస్క్ ప్రసాద్ ఒక సందర్భంలో ఈ విధం గా చెప్పారు.
గత ఆసియ కప్ మ్యాచ్ లో ఇండియా పాకిస్థాన్ పై ఆడవలసిన సందర్భంలో ధోని ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నాడు. దాంతో ప్రసాద్ ధోనిని ఆడగలవా అని అడిగినప్పుడు ధోని చెప్పిన సమాధానం తో ఆశ్చర్యపోయాడట చీఫ్ సెలెక్టర్ ప్రసాద్. సరిగా మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు తన దగ్గరకు వచ్చి ఎందుకు కంగారు పడతారు ప్రసాద్ గారు, ఒక కాలు కోల్పోయిన సరే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అని చెప్పాడంట. అది క్రికెట్ పట్ల దేశం పట్ల ధోనికి ఉన్న ప్రేమ.