2011 ఏప్రిల్ 2వ తేదీని భారత క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. నాడు ముంబయిలోని వాంఖడే మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు శ్రీలంకపై విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచులో ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోలేరు. ప్రపంచంలో మేటి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బీసీసీఐ తాజాగా ఓ వీడియోను పోస్టు చేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో వాంఖడే మైదానంలో ధోనీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న వీడియో ఇది. సాధనలో భాగంగా ధోనీ బౌలర్ వేసిన ఓ బంతిని సిక్స్‌గా మలిచాడు. ఈ సిక్స్ 2011 ప్రపంచకప్ ఫైనల్లో విన్నింగ్ షాట్‌ను గుర్తుచేసిందని బీసీసీఐ నిర్వాహకులు పేర్కొన్నారు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది.