మహేంద్రసింగ్ ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని, అతను టీ20ల్లో ఏమంత ప్రమాదకర ఆటగాడు కాదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘‘ధోని టీ20ల్లో మెరుగైన ఆటగాడని నేను అనుకోను. వన్డేల్లో అతను ఛాంపియనే కానీ.. టీ20ల విషయానికొస్తే గత పదేళ్లలో అతను కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు. ఇదేమంత గొప్ప రికార్డు కాదు’’ అన్నాడు. ఈ ఐపీఎల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని (12 నాటౌట్, 5, 11) విఫలమైన నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. జూన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో ధోని పరుగులు చేసి తీరాల్సిందే అని గంగూలీ అన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా " ధోనికి ఇది పీక్ సమయం అని, అతను కచ్చితంగా పరుగులు సాదించాలి " అని అన్నాడు.