//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీయల్ లో ధోనీ మరో రికార్డు...!

Category : sports

మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని వుండరు. క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ ని తిరగరాసాడు. ఇప్పుడు ధోని ఖాతా లో మరో రికార్డు వచ్చి చేరింది. ఎప్పుడు కూల్ గా వుండే ఈ కెప్టెన్ ఐపీయల్ లో మరో చరిత్ర సృష్టించాడు.

ఐపీయల్ లో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ ఒక మైలురాయి ని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన ఏకైక ఆటగాడిగా ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శనివారం పుణెలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు సొంతమైంది.

మొత్తం 150 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన ధోనీ 88 విజయాలు సాధించాడు. 59.45 శాతం విజయాలతో ఐపీఎల్‌లో మిగతా కెప్టెన్ల కంటే ముందున్నాడు. కాగా నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన వరుస విజయాలకు బ్రేక్ పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

Related News