ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన టీ-20, వన్డే సిరీస్‌ల్లో పాల్గొన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల భారత్‌కు తిరిగివచ్చేసాడు. ఇంగ్లండ్ పర్యటనలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ తెల్ల గెడ్డంతో కనిపించిన ధోని.. భారత్‌కు రాగానే తన లుక్‌ను మార్చేశాడు.
తాజాగా ధోని కొత్త హెయిర్ స్టైల్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఎప్పుడూ సరికొత్త హెయిర్ స్టైల్స్‌తో, సరికొత్త గెటప్‌లతో సందడి చేసే ధోని తాజాగా వీ-హాక్ హయిర్ స్టైల్‌తో హల్చల్ చేస్తున్నాడు.
ముంబైలోని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ వద్ద ధోని వి-హాక్ హెయిర్ స్టైల్‌ను చేయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం కొత్త హెయిర్‌స్టైల్‌తో ధోని ఉన్న ఫోటోలను సెలూన్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోని కొత్త హెయిర్‌స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.