ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం శుక్రవారం ముగియడంతో అభిమానులు చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ ఆనందాన్ని ఆ టీమ్ కెప్టెన్ ధోనీ సెలబ్రేట్ చేసుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీ వేసుకున్న అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను పెట్టాడు. తన ఇంటి ఆవరణలో పసుపు రంగు జెర్సీ ఫోటో దిగాడు ధోని. మాజీ కెప్టెన్ డాగ్ కూడా ఆ ఫోటోలో ఉంది.
జెర్సీపై తన పేరు ఉండాల్సిన స్థానంలో ‘తలా’ అని పేర్కొన్నాడు. తలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది.
చెన్నైని ఐపీఎల్ నుంచి రద్దు చేసిన తర్వాత ధోనీ పుణెకు ఆడాడు. కానీ ఆ జట్టు కెప్టెన్సీ కూడా పోగొట్టుకున్నాడు. వచ్చే ఏడాది నుంచి మళ్లీ చెన్నై జట్టు ప్రీమియర్ లీగ్‌లో కలుస్తుంది. ఇక ధోనీ మెరుపులు ఖాయమే. చెన్నైపై నిషేధం ఎత్తివేయడంతో ధోనీ భార్య సాక్షీ ధోనీ కూడా టీమ్ హెల్మెట్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.