ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ధోనీ బ్యాటింగ్లో దూకుడు తగ్గిందని, మ్యాచ్లను గొప్పగా ముగించడంలో విఫలమవుతున్నాడని ఇక ధోనీ పనైపోయిందని విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా క్రీజులోకి వచ్చి మునుపటిలానే మ్యాచ్లను ఫినిష్ చేస్తున్నవిషయం తెలిసిందే.
అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. మన మిస్టర్ కూల్ మహి..తాజాగా తన తొలిప్రేమపై పెదవి విప్పాడు. తన బయోపిక్ ధోని–ది అన్టోల్డ్ స్టోరీలో లేని తన లైఫ్లో జరిగిన సీక్రెట్ ఒకటి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మెజీషియన్ సరదాగా ధోని తొలి ప్రేమ గురించి చెప్పమనగా.. ఆమె పేరులో ఎ అక్షరముంటుందని.. అయితే అది పేరులోని మూడో అక్షరమన్నాడు. అయితే చివరకు ఆమె పేరు స్వాతి అని కూడా చెప్పేసి... తన భార్య సాక్షికు మాత్రం చెప్పకండి. ప్లీజ్ అంటూ నవ్వుతూ చెప్పేశాడు. ఇక తన తొలిప్రేమ గురించి చెబుతూ..1999లో తను 12వ తరగతి చదువుతుండగా తొలిప్రేమ చిగురించిందని.. అయితే ఏడాది తర్వాత తననెప్పుడూ చూడలేదని దోనీ తన మొదటి ప్రేమ గురించి చెప్పాడు.