//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధోని ముందు... క్రీజ్ దాటావా ఏబీ..?

Category : sports

టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఉన్నాడంటే చాలు ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే జాగ్రత్తగా మసులుకోవల్సిందే. బంతి చేతికి చిక్కడం ఆలస్యం స్టంప్స్ ని గిరాటేస్తాడు ధోని. అందుకే ఒక్క అంగుళం ముందుకి వెళ్ళాలన్నా సరే ఆటగాళ్ళు భయపడుతూ ఉంటారు. కాని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ ధోని ఉన్నాడని మర్చిపోయాడో ఏమో.. క్రీజ్ దాటి ముందుకి వెళ్లి అవుట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగూళురుతో...

జరిగిన మ్యాచ్‌లో ధోనీ మరో రికార్డు స్టంప్ ఔట్ చేశాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు జట్టును చెన్నై బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. హర్భజన్ సింగ్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ధోనీ చేతిలో స్టంప్ ఔట్ అయ్యాడు. ఈ స్టంప్‌ని ధోనీ కేవలం 0.16 సెకెన్ల రికార్డు వేగంతో చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనితో నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. వెనుక ధోని ఉన్నాడని మర్చిపోయాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.