ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కాస్త విరామం దొరకడంతో సరదాగా గడుపుతున్నారు.ఎప్పుడూ సహచరులతో సరదాగా ఉండే బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్.. ఈసారి కెప్టెన్ కోహ్లీకి ఓ పెరుపెట్టాడు.
అదీ ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్ అయిన ‘టామ్ అండ్ జెర్రీ’ నుంచి విరాట్‌కు ఓ పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తనతో విరాట్ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో రెడ్ క్యాప్ ధరించి విరాట్ కోపంతో చూస్తున్నట్లు ఉంది. నల్ల కళ్లద్దాలు, దుస్తుల్లో ఉన్న ధావన్ మరోవైపు చూస్తున్నట్లుగా ఉంది.
ఈ ఫొటో కింద‘ టామ్ అండ్ జెర్రీ వాలా బద్మాష్ బిల్లా.. విరాట్ కోహ్లీ, నేను జగ్గా జాట్’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది.ధావన్ ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య అయేషా ముఖర్జీ, ముగ్గురు పిల్లలతో కలిసి బంకింగ్‌హామ్ ప్యాలెస్ ముందు దిగిన ఫొటోలను అభిమానులను పంచుకున్నాడు. ఇంగ్లాండ్, భారత్‌ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.