//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెలరేగిపోయిన శ్రీదేవి కూతురు

Category : movies

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటనలో చెలరేగిపోయింది. జాన్వీ నటించిన తొలి చిత్రం ‘దఢక్’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ సరసన జాన్వీ నటించింది. ట్రైలర్‌లో జాన్వి నటన చూసిన ప్రేక్షకులు జాన్వీ నటన అద్భుతం అని కొనియాడారు.

మరాఠీలో సూపర్ హిట్ చిత్రమైన ‘సైరాట్’ రీమేక్‌గా వస్తున్న...ఈ సినిమాను ప్రేమ, గొడవల నేపథ్యంలో తెరకెక్కించారు. సోమవారం విడుదల చేసిన ట్రైలర్‌లో ఇద్దరి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు.. ప్రేమ, హాస్యంతో కూడుకొని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాంతోపాటు.. ఘర్షణలు, ఇద్దరూ ఇంటి నుంచి పారిపోవడం వంటి సీన్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే సైరాట్‌ క్లైమాక్స్‌నే ఇందులోనూ చూపిస్తారా? లేక ఏవన్నా మార్పులు చేశారా? అనేది చూడాలి.