//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రి దేవినేని తీసుకున్న ఆ ఒక్క నిర్ణ‌యంతో.. అనంత‌పురంలో టీడీపీ క్లీన్ స్విప్‌..!!

Category : politics

దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. విజ‌య‌వాడ‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌. ప్ర‌స్తుతం ఆయ‌న నీటిపారుద‌ల‌శాఖ అమాత్యులు కూడా. మ‌రి ఆ నేత‌కు అనంత‌పురం జిల్లాలో ప‌నేమిటి.? కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనంత‌పురం జిల్లాలో ఎలా చ‌క్రం తిప్పుతున్నాడు..? దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌ల‌కు దేవుడయ్యారా..?

అక్క‌డి టీడీపీ నేత‌ల‌కు ప్ల‌స్‌పాయింట్ అయ్యారా..? జిల్లా ప్ర‌జ‌ల ద‌శాబ్దాల క‌ల‌ల‌ను ఆయ‌న ఎలా నెర‌వేరుస్తున్నారు..? ఇంత‌కీ అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌ల‌కు దేవినేని ఉమా ఏం చేస్తున్నారు. ఈ క‌థ‌నాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిందే..! అనంత‌పురం జిల్లా రాయ‌ల‌సీమ‌కు చెందిన ఒక క‌రువు ప్రాంతం. క‌రువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లాలో నేడు జ‌ల‌సిరి తొణికిస‌లాడుతోంది. దీనికి కార‌ణం తెలుగుదేశం పార్టీ. అందులోను సీఎం చంద్ర‌బాబు నాయుడు. దీనికి కార‌ణ‌మైన చంద్ర‌బాబుకు, మ‌త్రి దేనినేని ఉమాకు ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే అధికారుల‌ను ఆయ‌న ప‌రుగులు పెట్టించారు. నీటి ప్రాజెక్టుల‌ను వేగంగా పూర్తి చేయించారు. క‌రువు జిల్లాగా పేరొంది.. చుక్క నీరు కూడా లేకుండా పోయిన అనంతపురం జిల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దానికి ప్ర‌ధాన కార‌ణం దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.

జిల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయిందంటే దేవినేని ఉమా మ‌హేవ్వ‌ర‌రావు కార‌ణ‌మంటూ అక్క‌డి ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు. నీటి కోసం అనంత‌పురం జిల్లా వాసులు ప‌డుతున్న క‌ష్టాల‌ను చూసి చ‌లించిన దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మంత్రి స్థాయిలో ఉన్న తాను ప్ర‌జ‌ల కోసం ఏం చేయాలో అవ‌న్నీ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుమతితో అనంత‌పురం జిల్లాలో చ‌క చ‌కా ప‌నులు కానిచ్చేస్తున్నారు. దాంతో అనంతురం జిల్లాలో నీటి క‌ష్టాలు తీరిపోతున్నాయి. అంతేకాకుండా, మ‌రో రెండు రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చింది చంద్ర‌బాబు స‌ర్కార్‌. మొత్తం అనంత‌పురం జిల్లా వాసుల నీటి క‌ష్టాలు ఇప్ప‌టికి తీరుతున్నాయ‌న్న మాట‌.

Related News