//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవేంద‌ర్ గౌడ్ పోటీచేసే స్థానం ఫిక్స్‌..! ఎక్క‌డి నుంచో తెలుసా..?

Category : politics

దేవేంద‌ర్‌గౌడ్‌, తెలుగుదేశం సీనియ‌ర్ నేత‌. చంద్ర‌బాబు స‌ర్కార్‌లో కీల‌క మంత్రిగా ప‌నిచేశారు. అయితే, 2009 త‌రువాత న‌వ తెలంగాణ పార్టీపెట్టి తెలంగాణ‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో తిరిగి సొంత‌గూటికి వ‌చ్చారు. అనారోగ్యం వ‌ల్ల కొన్ని రోజులు పార్టీ కార్య‌క‌లాపాలకు దూరంగా ఉన్నారు.

అయితే, ఈ మ‌ధ్య‌నే కోలుకోవ‌డంతో మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో క‌మిటీకి దేవేంద‌ర్ గౌడ్ చైర్మ‌న్‌గా ఉన్నారు. మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌లో పాలుపంచుకుంటున్నారు. ఏపీలో అన్న క్యాంటీన్ల మాదిరిగా తెలంగాణ‌లో జ‌య‌శంక‌ర్ క్యాంటీన్ల‌ను తీసుకు రావాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న పెట్టారు. టీడీపీతోపాటు మ‌హాకూట‌మి ఉమ్మ‌డి మేనిఫెస్టోలో కీల‌క ప్ర‌తిపాద‌న‌లు దేవేంద‌ర్ గౌడ్ తీసుకురాబోతున్నారు.

అయితే, ప‌నిలో ప‌నిగా ఆయ‌న రాజ‌కీయంగా తెర‌పైకి రావాల‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తుంది. గ‌తంలో మేడ్చ‌ల్‌, ఉప్ప‌ల్‌ నుంచి పోటీ చేసిన దేవేంద‌ర్‌గౌడ్ ఇప్పుడు కొడుకు వీరేంద‌ర్‌గౌడ్‌కు ఉప్ప‌ల్ సీటును ఒదిలేయాల‌ని అనుకంటున్నారు. మ‌హాకూట‌మిలో పొత్తులో భాగంగా ఉప్ప‌ల్ సీటు నుంచి వీరేంద్ర‌గౌడ్ పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. ఆయ‌న ఇప్ప‌టికే అక్క‌డ గ్రౌండ్‌వ‌ర్క్‌ను స్టార్ట్ చేశారు. మ‌రిదేవేంద‌ర్ గౌడ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌తంలో మేడ్చ‌ల్ నుంచి దేవేంద‌ర్‌గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత అక్క‌డ ఆయ‌న‌కు ప‌ట్టున్న ప్రాంతాలు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లిశాయి. దీంతో సామాజిక‌వ‌ర్గంతోపాటు ఇత‌ర అనుకూల వ‌ర్గాలు క‌లిసొచ్చే నియోజ‌క‌వ‌ర్గం కోసం దేవేంద‌ర్ గౌడ్ వెతుకుతున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్ సీటైతే త‌న‌కు అన్ని విధాలుగా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా దేవేంద‌ర్ గౌడ్ రాజేంద్ర‌న‌గ‌ర్ నుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే పోటీ కోసం ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Related News