//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అదిరిపోయిన దేవదాస్‌ ఫస్ట్ లుక్‌....!

Category : movies

మామూలుగా నా పక్కన పారు ఉండాలి.. కానీ ఈ సారి దాస్‌ దగ్గర ఇరుక్కున్నాను’ అంటున్నారు నాగార్జున. ఆయన, నాని కథానాయకులుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్విని దత్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. నాగ్‌, నాని పక్కపక్కన పడుకుని ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

దీన్ని నాగ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సాధారణంగా పారు నా పక్కన ఉండేది. కానీ ఈ సారి ఈ దాస్‌ పక్కన ఇరుక్కున్నా’ అంటూ కోపంతో ఉన్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. ఈ సినిమా ఫన్‌గా ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 27న నిద్ర లేవబోతున్నామని ప్రచార చిత్రంపై రాసి ఉంది. నాగ్‌ చేతిలో తుపాకీ, మందు సీసా ఉండగా.. నాని మెడలో స్టెతస్కోప్ ఉంది.

‘1996-‘నిన్నేపెళ్లాడతా’.. నాగ్‌ సర్‌ వెండితెరపై.. నేను దేవి 70 ఎంఎం థియేటర్‌ వద్ద టిక్కెట్ల కోసం క్యూలో. 2018-‘దేవదాస్‌’.. మేమిద్దరం ఫస్ట్‌లుక్‌లో.. తాగి, పడి ఉన్నాం’ అని నాని ఇదే సందర్భంగా తన పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.‌

For more updates visit ins media