Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లకలక లకుమీకర లంభోధరా...దేవదాస్ వినాయకచవితి కానుక...!

Category : movies

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. చిత్రంలో కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని హీరోలుగా నటించగా రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన ఈ సినిమా నుంచి తాజాగా మూడో లిరికల్ సాంగ్ బయటకు వదిలారు.

మా పండుగ ముందే మొదలయ్యింది అని పేర్కొంటూ వినాయకచవితి కానుకగా ఈ పాటను విడుదల చేశారు. వినాయకచవితి పండుగ వేళ వినాయకుడి పాటతో అదరగొట్టేశారు ‘దేవదాస్’లు. ‘‘రాజాధి రాజా గణరాజ.. విగ్నేశ్వరాయ జాయెహో..’’ అంటూ మొదలైన ఈ పాట ‘గణపతి పప్పా మోరియా’ నినాదాలతో హోరెత్తుతూ ‘లకలక లకుమీకర లంభోధరా’ అంటూ హుషారెత్తిస్తోంది. మణిశర్మ బాణీలు కట్టిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, శ్రీ కృష్ణ గొంతు కలిపారు. ప్రస్తుతం ఈ పాట వేగంగా వ్యూస్ రాబడుతోంది. ‘దేవదాస్’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News