Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డేరా బాబా జైల్లో ఏమి చేస్తున్నాడు.

Posted 2 months ago | Category : national

2002లో దాఖలైన రెండు అత్యాచార కేసుల్లో డేరాబాబా గుర్మీత్ సింగ్‌ను దోషిగా తేల్చిన పంచకుల ప్రత్యేక కోర్టు... అతడికి 20 యేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆగస్టులో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో ఊచలు లెక్కిస్తున్న డేరాబాబా గుర్మీత్ సింగ్.. జైల్లో కూడా తన దర్పాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదట! మంగళవారం రోహ్‌తక్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన రాహుల్ అనే ఓ ఖైదీ.. డేరాబాబా కారాగారవాసంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఖైదీలంతా ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిఉండగా... డేరాబాబా ఇప్పటి వరకు కనీసం ముఖం కూడా చూపించలేదని పేర్కొన్నాడు. ఖైదీలను కలుసుకునేందుకు వచ్చినవారిని నిముషాల్లోనే పంపించివేస్తుండగా.. డేరాబాబాని విజిటర్లకు మాత్రం గంటల కొద్దీ సమయం ఇస్తున్నట్టు రాహుల్ వెల్లడించాడు.

‘‘ఇప్పటివరకు మాలో ఎవరూ డేరాబాబాని చూడలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడని మాత్రమే మాకు తెలుసు. పైగా ఆయన జైల్లోకి అడుగుపెట్టింది మొదలు మాపై చాలా ఆంక్షలు విధించారు. గుర్మీత్ సింగ్ వచ్చిన దగ్గర్నుంచి ఖైదీలెవరినీ జైల్లో స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు...’’ అని రాహుల్ పూసగుచ్చినట్టు వెల్లడించాడు. జైల్లో ఏదైనా పనిచేస్తున్న తామెప్పుడూ చూడలేదనీ... అసలు ఆయనకు ఏదైనా పని అప్పగించారో లేదో అన్నది కూడా తెలియదన్నాడు. సాధారణంగా ఖైదీలను కలుసుకునేందుకు బయటినుంచి ఎవరైనా వస్తే 20 నిమిషాలకు మించి ఉండనివ్వరనీ.. గుర్మీత్ కోసం వచ్చినవాళ్లు మాత్రం దాదాపు రెండు గంటలకుపైగా ఉంటారని రాహుల్ పేర్కొన్నాడు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !