Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిప్యూటీ సీఎంపై సోదరుడి పోటీ ... పెద్దాపురంలో పోరు రసవత్తరమే

Category : politics

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గ పోరు రసవత్తరంగా మారబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుండి టిడిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్న డిప్యూటీ సీఎం చిన్న రాజప్ప కు, సోదరుడు లక్ష్మణ మూర్తి నుండి పోటీ ఎదురుకానుంది. లక్ష్మణ మూర్తి జనసేన నుండి పెద్దాపురం టిక్కెట్ ఆశిస్తుండగా, అదే స్థానం నుండి డిప్యూటీ సీఎం చినరాజప్ప మరల ఉండనున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందా అన్న విషయంఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లో బంధుత్వాలకు తావులేదు. రక్త సంబంధాలకు విలువలేదు. ఎవరికి వారు రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే బంధుప్రీతిని పక్కన పెట్టాల్సిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్పకు సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈసారి సొంత సోదరుడి నుంచే పోటీ ఉంటుందంటున్నారు.అందుకు కారణం ఆయన సోదరుడు లక్మణమూర్తి జనసేన టిక్కెట్ కోసం అప్లయి చేసుకోవడమే. చినరాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నియజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ మూర్తి కూడా ఆ నియోజకవర్గానికే టికెట్ కోరుతూ జనసేన స్క్రీనింగ్ కమిటీకి అప్లికేషన్ ఇచ్చారు. ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేన ఎంతవరకు లెక్కలోకి తీసుకుంటుందో తెలియదు కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ చినరాజప్ప సోదరుడు లక్ష్మణ మూర్తి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే చినరాజప్పకు సోదరుడితో పోటీ తప్పదు.

ఇప్పటికే ముద్రగడ ఉద్యమ సమయంలో కాపులను అటు వెళ్లకుండా ఆపలేకపోయారని.. ఆ తరువాత జనసేన ప్రాభవాన్ని తగ్గించడంలోనూ చినరాజప్ప ఏమీ చేయలేకపోతున్నారని స్వయంగా చంద్రబాబుకే అసంతృప్తి ఉందని చెబుతారు. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆయన సోదరుడే జనసేనలో చేరి టిక్కెట్ కోరితే ఇప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారట చినరాజప్ప. మొత్తానికి చిన్న రాజప్ప తనపై సోదరుడు ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం.

Related News