//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Category : politics

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజక వర్గం లోని మండలాలు పెదవేగి,పెదపాడు,పెదపాడు,ఏలూరు.ఇక్కడ నుండి ప్రస్తుతం ఎమ్మెల్యే గా చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు,ఈయన గత రెండు ధపాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.2014 ప్రత్యర్ది వైసీపీ అబ్యర్థి అయిన కారుమూరి వెంకట నాగేశ్వరావు ఫై భారీ తేడా తో 2014 లో గెలుపొందారు.

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సి.హెచ్.ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ తరఫున కె.రామచంద్రారావు, ప్రజారాజ్యం పార్టీ నుండి అశోక్ గౌడ్ పోటీచేశారు. తెలుగు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ విజయం సాధించాడు.

మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. గత ఎన్నికల్లో చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 2011లో గ్రామసభలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకుని, ఎంపీ కావూరి సాంబశివరావుపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ కేసులో నేడు తీర్పు వెలువడింది. చింతమనేని దోషిగా నిరూపితం కావడంతో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

అలాగే మరో ఘటన లోను మ్మెల్యే చింతమనేని ఇరుకున్నారు.ఎంర్ఓ వన జాక్షి ఫై చేయి చేసుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం ఆయనపై వేటు వేయాలని కోరుకున్నది . కోడిపందాలు చింతమనేని వ్యాఖ్యలు ఇంతకూ కోడిపందాలపై చింతమనేని ప్రభాకర్ ఏమన్నారంటే కోళ్లకు సహజంగానే కొట్టుకునే గుణం ఉంటుందని, అవి ఒకదానికొకటి తారసపడగానే సహజసిద్ధంగా కొట్టుకుంటాయని అలా కొట్టుకున్న సమయంలో నలుగురు గూమికూడుతారని అదికూడా సహజమేనని. అన్నారు. పైగా అలా కొట్టుకునే కోళ్లను సుప్రీంకోర్టు ఆపలేదని మనుషులైతేనే ఆపగలమంటూ ఆయన విచిత్రమైన లాజిక్‌ చెప్పారు.

అయన ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు లో ప్రజలను అడిగితె మా నేత చింతమనేని గారు ఏమైనా అవసరం వచ్చిన,పేద వారికోసం అప్పుడైనా ఏమైనా చేయడానికి ముందుంటారు అని నియోజక వర్గం మొత్తం చెబుతున్నారు.ఎప్పుడు ఏదో ఒక గొడవ లో ఉంటాడు.

Related News