ఐపీల్ పదకొండో సీజన్ మొదలౌవకముందే స్టార్ ప్లేయర్స్ ఒక్కొరిగా ఈ మెగా టూర్నికి దూరమౌతున్నారు. మొదటగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ లు బల్ టాంపరింగ్ విషయం లో చిక్కి ఒక సంవత్సరం పాటు క్రికెట్ కు దూరమయ్యారు. దీనితో ఐపీల్ లోకి వీరిని నిషేదించారు.
అలాగే ఇంకో స్టార్ బౌలర్ స్టార్క్ కూడా గాయాల కారణం గా ఐపీల్ కి దూరమయ్యాడు. ఎప్పుడు ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టుకు ప్రధాన బౌలంగా అనుకునే సౌత్ ఆఫ్రికా సంచలనం కాగిసో రబడా ఐపీల్ నుండి తప్పుకున్నాడు.
వెన్నెముక కింది భాగంలో గాయం కావడంతో రబడా కి మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీనితో ఈ సీజన్ మొత్తానికి దూరంకానున్నాడు. ఈ మధ్యే ఆసీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న రబాడపై ఢిల్లీ డేర్ డెవిల్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఎప్పుడు విష్యం తెలుసుకున్న జట్టు షాక్ కి గురయ్యింది.