//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

13 గంటల్లో ఢిల్లీ - ముంబై రైల్ ప్రయాణం త్వరలో !

Category : national

రైల్వేలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ప్రయాణికులను గమ్యం చేరవేయడానికి రంగం సిద్ధమవుతున్నది. మొదటగా ఢిల్లీ నుండి ముంబై కి రాజధాని ఎక్సప్రెస్ 13 గంటల సమయంలో చేరే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు 16 గంటల సమయం పడుతున్నది. దానితో ఒక రాత్రి సమయంలో చేరగలిగితే విమానాలపై ప్రయాణించే పలువురు ఈ రైలును ఎంచుకోగలరని భావిస్తున్నారు. 

ఇప్పటికే ఒకసారి ట్రయిల్ రన్ జరిగినదని, ఈ నెలలో రైల్వే బోర్డు సమావేశమై సమీక్ష జరిపిన అనంతరం మరో ట్రయిల్ రన్ జరుగగలదని తెలుస్తున్నది. ప్రస్తుతం 24 కోచ్ లతో ఉన్న రాజధాని ఎక్సప్రెస్ 130 కి మీ వేగంతో నడవవలసి ఉండగా పలుచోట్ల మలుపులు ఉండటం, ఇతర వేగ పరిమితుల కారణంగా 90 కి.మీ కి మించి నడవలేక పోతున్నది. దానితో 1,385 కి మీ దూరంకు 15.35 గంటలకు పైగా  సమయం పడుతున్నది. 

ఇప్పుడు 14 కోచ్ లతోనే, ఒకే ఇంజిన్ తో నడపాలని నిర్ణయించారు. 150 కి మీ కు మించి వేగంగా వెళ్ళడానికి వీలుగా అత్యాధునిక ఎల్ బి యచ్ కోచ్ లను వాడనున్నారు. దీని ఇంజిన్ వేగం సామర్ధ్యం 200 కి మీ వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ రైల్ కు మార్గ మధ్యలో ఆరు చోట్ల ఆగుతుండగా దానిని రెండు లేదా ఒక చోట ఆగే విధంగా కుదింపనున్నారు. ఈ రైల్ లో ఎక్కువగా వ్యాపార వర్గంవారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా మార్గాలను వేగవంతమైన సేవలతో ప్రత్యేక కారిడార్ గా అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రైల్ వేగం పెంచుతున్నారు. 

Related News