//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దీప్తి సునైనా చేసింది తప్పుకాదా ...అప్పుడు ఆలా ....ఇప్పుడు ఇలా...!

Category : movies

యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పుడు అందరికి తెలుసు. హౌస్ లో ఉండే వారిలో ఎప్పుడు సైలెంట్ గా ఉండే వారిలో సునైనా ఒకరు. ఆమె హౌస్ లో హీరో తనీష్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నది అని అందరూ అనుకుంటున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే ....ఈవారం ఏంటి కెప్టెన్ ని నియమించడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ నిర్వాహకురాలిగా సునైనా ని నియమించాడు. ఈ పెయింటింగ్ టాస్క్ లో తనీష్ మరియు దీప్తి నల్లమోతు ఇద్దరు నువ నేనా అనేవిధంగా పోరాడారు . చివరకు ఈ టాస్క్ లో తనీష్ గెలిచాడని సునైనా ప్రకటించింది. దీనితో ఇంటి కొత్త కెప్టెన్ గా తనీష్ ఎన్నికయ్యాడు.

ఈ టాస్క్ లో చాలా పోరాట పటిమను చూపిన దీప్తి నల్లమోతు తీరు అందర్నీ అలరించింది. దీప్తి సునైనా బిగ్ బాస్ ప్రారంభంలో కౌశల్ తనను టాస్క్ లో భాగంగా కౌశల్ ఎత్తుకున్నాడని రచ్చ రచ్చ చేసింది. మరి ఇప్పుడు తనీష్ టాస్క్ సమయంలో దీప్తి నల్లమోతుతో ప్రవర్తించిన తీరు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ తింటారు. ఎందుకంటే దీప్తి నల్లమోతు పెయింట్ వేయకుండా తనీష్ చాలా దారుణంగా ప్రవరించాడు.అప్పుడు కౌశల్ ని తప్పు పట్టిన దీప్తి సునైనా ఇప్పుడు తనీష్ ని ఏ మాత్రం తప్పు పట్టకుండా తనిషే గెలిచినట్టు ప్రకటించింది. దీనితో బిగ్ బాస్ సగటు అభిమాని హౌస్ లో ఏమిజరుగుతుందని చర్చించుకుంటున్నారు.