//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సిబిఐ దర్యాప్తుకు దీప పట్టు... పోయెస్‌ గార్డెన్‌ ఆధీనంకై డిమాండ్

Category : national

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి న్యాయ విచారణకు ఆదేశించడాన్ని జయ మేనకోడలు దీపా జయకుమార్‌ తప్పుబట్టారు. హాస్యాస్పదంగా ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలను వెర్రివాళ్లను చేసేందుకే ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. 'అమ్మ' మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె  డిమాండ్‌ చేశారు.

కాగా, జయలలిత నివసించిన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మారుస్తామని పళనిస్వామి ప్రకటించడంపై దీప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ ఇల్లుపై తనకు, తన సోదరుడికే నైతికంగా, చట్టబద్ధంగా, అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. జయలలిత రక్తసంబధికులను సంప్రదించకుండా ఎలా ప్రకటన చేస్తారని ఆమె  ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. .

కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి"వేద నిలయానికి అసలైన వారసులం మేమే. మా అనుమతి లేకుండా స్మారక మందిరంగా ఎలా చేస్తారు. వేద నిలయంపై నాకు, నా సోదరి దీపా జయకుమార్‌కు మాత్రమే హక్కు ఉంది" అని దీప సోదరుడు దీపక్‌ సీఎం పళనిస్వామికి లేఖ రాశారు. ఆ ఆస్తిని తమకు స్వాధీనం చేయాల్సిందిగా  ఆ లేఖ ద్వారా సీఎంను కోరారు.

 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వేద నిలయం ఉంది. గతంలో దీప ‘అమ్మ’ చనిపోయిన తర్వాత ఆ వేద నిలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వేద నిలయం ప్రస్తుతం శశికళ ఆధీనంలోనే ఉన్నందున సీఎం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.