//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2017లో అత్యంత ప్రమాదకరమైన రోజు...డిసెంబరు 21

Category : history national

వెళ్తూ.. వెళ్తూ.. 2017 ఓ భయంకరమైన రోజును మనకి ఇచ్చిపోతుందా...? డిసెంబరు 21న ఏ పని మొదలు పెట్టినా అది నాశనమేనా ...? ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా దురదృష్టం వెంటాడుతుందా...? ఆ ప్రభావం 2018లో కూడా కొనసాగుతుందా....? అవును అనే అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్కులు.

నిజానికి ఈ ఏడాదిలోనే అతి తక్కువ పగటి కాలం డిసెంబరు 21న నమోదవుతుంది. అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ 350 ఏళ్లలో మొదటిసారిగా సూర్యుడు, శని ఒకే రాశిలోకి రావడం ప్రళయ సంకేతమని నీల్‌ స్పెన్సర్‌ అనే జ్యోతిష్కుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీ.శ.1664 తర్వాత అలాంటి ఖగోళ మార్పు గురువారం సంభవిస్తుందని వివరిస్తున్నారు.

‘వ్యక్తుల జాతకంలో శని మకరంలో ప్రవేశిస్తే లాభదాయకమే! కానీ ఖగోళపరంగా స్థూల స్థాయిలో ఇది ప్రమాదకరమైన విషయం! ప్రళయ కారకం కూడా!’ అని స్పెన్సర్‌ పేర్కొన్నారు. అంతేకాదు గురువారం ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవద్దనీ అనేక ఆస్ట్రాలజీ వెబ్‌సైట్లు కూడా సూచిస్తున్నాయి. ‘డిసెంబరు 21న పగటి వేళ తక్కువగా ఉంటుంది. అందరిలో శక్తి తక్కువగా ఉంటుంది.

ఆరోజు ఏ సమావేశాలకు వెళ్లకండి. ఏ కొత్త పనులూ మొదలుపెట్టకండి. కాదని చేస్తే.. 2018లో కూడా ఇబ్బందులు వెంటాడుతాయని’ లునార్‌ లివింగ్‌ అనే వెబ్‌సైట్‌ హెచ్చరిస్తోంది. మరి మీరు కూడా రేపు ఎలాంటి కొత్త నిర్ణయాలు, కొత్త పనులు మొదలు పెట్టకండి సుమీ..!