సోమాలియా ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 189కి చేరింది. దాడిలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు అందించేందుకు డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు. అంబులెన్స్ సైరన్లు ఇంకా నగరంలో వినిపిస్తున్నాయి. హోడన్ జిల్లాలోని హోటల్ లక్ష్యంగా నిన్న ఉగ్రవాదుల దాడి జరిగిన విషయం తెలిసిందే