//single page style gallary page

Dear comrade trailer review

Category : movies

Click here to read this article in Telugu

"డియర్ కామ్రేడ్" ట్రైలర్..రివ్యూ

"గీత గోవిందం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న "డియర్ కామ్రేడ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు భరత్ కమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే. డియర్ కామ్రెడ్ ట్రైలర్ చూస్తే కంటెంట్ పరంగా రిచ్‌గా కనిపిస్తున్నది. ఇందులో డైలాగ్స్ భావోద్వేగంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. "కాలేజీలో పాలిటిక్స్‌ను ఆపకపోతే మేమే ఆపాల్సి వస్తుంది" అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్, కాలేజీ పాలిటిక్స్, గొడవలను తెలియజేసింది. కాలేజీలో గొడవలు, కొట్లాటలు ఉద్రేకపూరితంగా కనిపించాయి.

ఇక లవ్ ఎపిసోడ్స్ కూడా చాలా ఫీల్‌గుడ్ గా ఉన్నాయి. "వచ్చినప్పుడు ఎంతో గొప్పగా ఉన్న ప్రేమ పోయిన తర్వాత ఎందుకింత బాధపెడుతున్నది" అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. "ఇలాంటి ధైర్యం, తెగువ మంచిదే కానీ, ఈ గొడవలో పొగొట్టుకున్నవే నిన్ను అన్నింటికన్నా ఎక్కువగా బాధపెడుతున్నాయి" అంటూ తండ్రి చెప్పిన డైలాగ్స్ సినిమాలో చైతన్య జీవితంలో ఏదో జరిగిందనే ఫ్లాష్ బ్యాక్‌ను తెలియజేసింది.

"నీకు తోడుగా ఉంటాను, లెట్ మీ డియర్ కామ్రేడ్" అంటూ భావోద్వేగంగా చెప్పిన మాటలు ప్రేమికులను అమితంగా ఆకట్టుకొనేలా ఉన్నాయి. "మూడేళ్ల క్రితం ఉన్న కోపం ఇప్పుడు లేదు. నన్ను మీనాన్నను,ఈ సొసైటీని మరిచిపో. నీకు ఏం కోవాలో దాని కోసమే పోరాటం చేయి. ఇలా పిరికిదానిలా ఉండకు లిల్లీ" అనే డైలాగ్స్ సినిమా ఇంటెన్సిటీని తెలియజేశాయి. ఓవరాల్‌గా ఈ సినిమా ఒక మిక్స్‌డ్ బ్యాగ్‌లా కనిపించింది.

నటీనటులు, సాంకేతిక వర్గం -

→ నటీనటులు - విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులు

→ దర్శకుడు - భరత్ కమ్మ

→ సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్

→ సంగీతం - జస్టిన్ ప్రభాకరన్

→ ఆర్ట్ డైరెక్టర్ - రామాంజనేయులు

→ ఎడిటర్ - శ్రీజిత్ సారంగ్

→ డైలాగ్స్ - జయ్ కృష్ణ

→ నిర్మాతలు - నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని

→ స్టంట్స్ - మురళీ

After the blockbuster hit of "Geeta Govindam", Vijay Deverakonda and Rashmika starrer "Dear Comrade" is set for release. The already released teaser and songs are trending on social media now. The trailer of the movie was released in Hyderabad on Thursday as part of its promotion. The event was attended by Vijay Deverakonda, Rashmika Mandanna and director Bharat Kamma.

Here's what this trailer looks like. The Dear Comrade trailer looks rich in terms of content. Dialogues in this are emotionally minded. Vijay Deverakonda's dialogue, "College Politics and Conflict," says Vijay Deverakonda, "We have to do it if we don't have Politics in college." The uproar and clashes in the college were seen as furious.

Love episodes are also very goodgood. Vijay Deverakonda's dialogue is also very emotional, saying, "Why is it hurt after a great love to come?" "Such courage, daring is good, but in this confrontation, you are suffering more than anything," said the father's dialogues, flashbacks of something in the life of the film.

Emotional remarks such as "I'll be with you, let's be your dear camaraderie" are very appealing to lovers. Dialogues such as "Lily" conveyed the film's intensity. "Three years ago there was no anger. Forget me, you and this society. Fight for what you want. Don't be shy." Overall the film looked like a mixed bag.

Actors, Technical Category -

→ Actors - Vijay Deverakonda and Rashmi Mandanna

→ Director - Bharat Kamma

→ Cinematographer - Sujit Sarang

→ Music - Justin Prabhakaran

→ Art Director - Ramanjaneyu

→ Editor - Srijit Sarang

→ Dialogues - Jay Krishna

మా Producers - Naveen Yerneni, Ravishankar Yalamanchili, Mohan Cherukuri, Yash Rangineni

ంట్ Stunts - Murali