//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహాకూటమికి డెడ్ లైన్: ఒంటరి పోరుకు సిద్దమైన పార్టీ...?

Category : politics

శాసనసభని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు తెరతీశాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. వెంటనే తమ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులు కూడా ప్రకటించాడు. ఈ ఎలక్షన్స్ లో బీజేపీ ఒంటరిగా పోటీచేయనుంది. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీకి సిద్ధమయ్యాయి. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒకప్రక్క అధికార టిఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉంది.

కానీ మహా కూటమిలో సీట్ల లొల్లి ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. మాకు అన్ని సీట్లు ఇస్తేనే మహా కూటమిలో కొనసాగుతామని పార్టీలన్నీ తెగేసి చెప్పేస్తున్నాయి. దీనితో విసుగు చెందిన టీజేఎస్ పార్టీ వ్యస్థాపకుడు కోదండరాం రెండ్రోజుల్లోగా తాము కోరిన సీట్లను ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసారు. ఈ రెండు రోజులలో తేల్చకపొతే, మొదటి విడత 21 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటిస్తామని.. వారం రోజుల తర్వాత మరో 30 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తామని టీజేఎస్ స్పష్టం చేసింది. కోదండరాం వార్నింగ్ తో మహాకూటమిలో ఏమి జరగబోతుందో..

Related News