//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ విషయంలో రకుల్ స్టామినా యే వేరు..30 గంటలైనా తనకు ఒకే నట..!

Category : movies

" కెరటం " సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ఆ సినిమా తరువాత వరుస పెట్టీ టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ఎన్ .టీ. ఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వాటి స్టార్స్ తో నటించే అవకాశాలు కొల్లగొట్టింది. ఆ మధ్య సరైన హిట్ సినిమాలు లేక కెరీర్ కొంచెం డల్ గా కనిపించిన రకుల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు కొల్ల గొడుతు అందినంత వరకు ఆఫర్స్ బుట్టలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు " దే దే ప్యార్ దే" సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే...కష్టపడి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. పనిని నేను ఆస్వాదిస్తాను.వర్క్‌ను నేను ఎంతగా ఇష్టపడుతానంటే.. 30 గంటల పాటైనా అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేయగలను.

ప్రతిభావంతులతో పనిచేయాలని ఎప్పుడూ కోరుకొంటాను. అలాంటి వారి నుంచి కూడా ఇదే విధంగా ఆశిస్తాను. నాలో ప్రతిభను గుర్తించే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని రకుల్ అన్నారు. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది.వారిలోని టాలెంట్‌ను దగ్గర నుంచి చూసి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వారిని చూసి స్ఫూర్తి పొందడం జరుగుతుంది. నీ ముందు సీనియర్లు ఉంటే వారిని మెప్పించేలా నటించాలనే కోరిక కలుగుతుంది. దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్, టబుతో కలిసి నటించడం గొప్ప అనుభవం అని రకుల్ చెప్పింది.