Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం చనిపోయాడా ..?

Category : world

మాఫియా డాన్ దావుద్ నిజంగానే చనిపోయాడా ..?. పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఈ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, అతనికి తీవ్రమైన గుండెపోటు రావటంతో కరాచీలోని ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడని పాకిస్థాన్‌కు చెందిన కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి. దీనితో దావుద్ చనిపోయాడు అంటూ వదంతులు వచ్చాయి. అయితే ఈ వార్తలను డాన్‌ సన్నిహితుడు చోటా షకీల్‌ తోసిపుచ్చారు. భాయ్ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఇవన్నీ ఉత్తి పుకార్లే అని కొట్టిపడేశాడు. అయితే 20 రోజుల క్రితం తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చిందని, కుడి వైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయిందని ఓ వార్తాసంస్థ తెలిపింది. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్‌ గత కొన్నేళ్లుగా అండర్‌వరల్డ్‌కు వెళ్లిపోయాడు. అతడు కరాచీలో ఉంటున్నాడని వార్తలు రావటంతో, అతడిని తమకు అప్పగించాలని భారత ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే దావూద్‌ తమ వద్ద లేడని పాక్‌ బుకాయిస్తూనే ఉంది. నిజంగా దావుద్ చనిపోతే భారత్ దేశానికి పట్టిన దరిద్రం పోయినట్లే ...

Related News