Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఆటగాడు మళ్ళి వచ్చేసాడు

Category : sports

రెండు నెలల క్రితం ముగిసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సీరీస్ లో బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడి బుక్కైన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మళ్ళి క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. జూన్‌ చివరి వారంలో కెనడాలో టీ20 గ్లోబల్‌ లీగ్‌ ప్రారంభంకానుంది. ఈ లీగ్‌లో ఆడేందుకు వార్నర్‌ ఓ ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో అతను ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని తానే అభిమానులతో పంచుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఈ సెషన్‌ కాస్త కష్టంగానే గడిచింది. ముందుకు కొనసాగుతాను’ అని పేర్కొన్న వార్నర్‌ తాను ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కాగా ఈ లీగ్ లో వచ్చిన మొత్తాన్ని కెనడా క్రికెట్ అభివృద్దికి ఇచ్చేస్తున్నట్టు వార్నర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Related News