//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమను త్యాగంచేస్తున్న అమ్మాయిలు

Category : editorial

తల్లిదండ్రుల కోసం అమ్మాయిలు ప్రేమను త్యాగం చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమకు ఇష్టం లేకుండానే చాలాసార్లు వారు పెళ్లి పీటలు ఎక్కుతారని చెప్పింది. ఇలాంటి తరుచుగా భారత దేశంలో జరుగుతాయని, ఇందుకు కులం సమస్యలే ప్రధానం అని పేర్కొంది. ఓ యువకుడికి పడిన జీవిత ఖైదు శిక్షను మార్పు చేసే సందర్భంలో కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

రాజస్థాన్‌లో 1993లో ఓ యువతి యువకుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి పెద్దలు నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఈ ప్రయత్నంలో యువతి చనిపోగా యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే, ఆ యువతి కుటుంబ సభ్యులు అతడే హత్య చేశాడంటూ కేసు పెట్టారు. దీంతో ఈ కేసును విచారించిన కిందిస్థాయి కోర్టు అతడికి జీవిత ఖైదు విధించగా దానిని రాజస్థాన్‌ హైకోర్టు కూడా సమర్థించింది.

ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్లగా జస్టిస్‌ ఏకే సిక్రీ, అశోక్‌ భూషణ్‌ ఈ కేసుపై తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తొలుత అయిష్టంగానే తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకునేందుకు యువతి ఒప్పుకోవచ్చేమోగానీ.. పెళ్లి హడావుడి మొదలయ్యే సమయంలో ఆ పరిస్థితులు చూసి మారిపోయే అవకాశం ఉందంది. అలాగే, కుటుంబం అంగీకరించడంలేదని పెళ్లి చేసుకోలేనని ప్రియుడికి కూడా చెప్తుండొచ్చు. 

తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించేందుకు ఓ యువతి తన ప్రేమను త్యాగం చేయడం అయిష్టంగానే తల్లి దండ్రులు చెప్పిన మాట వినడం ఈ దేశంలో ఒక సాధారణ అంశం అని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. అమ్మాయి అబ్బాయి నిజంగానే ప్రేమించుకుని ఉన్నారని కోర్టు విశ్వసిస్తోందని, కులపరమైన విభేదాలు ఉండటం వల్లే అమ్మాయి తండ్రి అంగీకరించకపోయి ఉండొచ్చని, దాంతోనే వారి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండొచ్చు తప్ప అతడు హత్య చేసి ఉండకపోవచ్చని భావిస్తూ అతడిపై నేర పూరిత అభియోగాలు నమోదు చేయలేమని తెలిపింది.

Related News