//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు వద్ద డేటా చోరీ కీలక సాక్ష్యం ... రెడ్ హ్యాండెడ్ గా దొరికారని బాబు ఫైర్

Category : politics state

తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారి రాజకీయ వివాదాలకు కారణం అవుతున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. ఆ సాక్ష్యాలను తానూ బయటపెడతానని చెప్పి సంచలనం సృష్టించారు.

ప్రస్తుతం చంద్రబాబు చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.చంద్రబాబు దగ్గరున్న సాక్ష్యం ఏంటి? దాని గురించి ఆయన ఏం చెబుతారు? వైసీపీ, టీఆర్ఎస్‌ని ఎలా టార్గెట్ చేయబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం(మార్చి 9) మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తా అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ వేసిన యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటున్నారని, కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారని చెప్పారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని సీఎం చెప్పారు. డేటా చోరీ చేశామని తమపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల తాట తీస్తానని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Related News