ట్రెండ్ కి తగ్గట్టు కొత్త కొత్త ప్రయోగాలు చేసే హీరోలలో ధనుష్ ఒకడు. అదేవిధంగా అప్పుడప్పుడు వేరే బాషలలో కూడా సినిమాలు చేస్తుంటాడు ధనుష్.
అంతకముందు రంజానా అంటూ బాలీవుడ్ లో ఓ మూవీ చేసి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ లో కూడా నటిస్తున్నాడు ధనుష్.
ధనుష్ తొలిసారిగా నటించిన హాలీవుడ్ మూవీ ది ఎక్సట్రాడినరీ జర్నీ అఫ్ ది ఫకీర్. కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. నార్వేరియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ “రే ఆఫ్ సన్ షైన్” అవార్డును సొంతం చేసుకుంది.. ఈ అవార్డు రావడం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు..ఆయనతో పాటు అయన అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు.