//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిత్య పెళ్లి కూతురు మేడిన్ యూపీ

Category : national

యువకులను ప్రేమిస్తున్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి పెళ్లాడి మొదటిరోజే చేతికందిన డబ్బు, నగలతో పరారైన కిలాడీ లేడీని ఉత్తరప్రదేశ్ పోలీసులు కటాకటాల్లోకి పంపించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన ప్రీతీ అనే వివాహిత తన భర్తతో కలిసి సీరియల్ పెళ్లిళ్లకు తెర లేపింది. ప్రీతి అందంగా ముస్తాబై వచ్చి యువకులను ఆకర్షించి ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోమని అడుగుతోంది.

అందాల రాశి అయిన ప్రీతీనే అడగడంతో యువకులు పెళ్లికి రెడీ అయిపోతారు. అంతే మూడు ముళ్లు పడగానే వధువు ప్రీతి కాస్తా నగలు, డబ్బుతో పారిపోతోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది వరులను మోసగించిందని యూపీ జిల్లా ఎస్పీ ఉదయ్ శంకర్ చెప్పారు. లేడీ కిలాడీ మోసాలపై సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో వరులైన యువకులు సైతం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

దీంతో ఈ లేడీ కిలాడీ మోసాల పెళ్లిళ్ల తంతు సాగించిందని పోలీసులు చెప్పారు. ప్రీతి యువకులను ఆకట్టుకొని వారిని పెళ్లి పీటలెక్కించి మోసగించి పారిపోతున్న వ్యవహారంలో భర్త పాత్ర కూడా ఉందని పోలీసులు వివరించారు. పెళ్లి ఏర్పాట్లు భర్తే చూసే వాడని పోలీసులు పేర్కొన్నారు. వీరి వెనుక మరికొందరు ముఠా సభ్యుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోనమ్ కపూర్ నటించిన ‘డాలీ కి డాలీ’ చిత్రం చూసి దాన్నుంచి ప్రేరణ పొంది పెళ్లిళ్ల పేరిట మోసాలకు తెర లేపానని ప్రీతి పోలీసులకు చెప్పడం సంచలనం రేపింది.