//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళనాడులో ఘోర ప్రమాదం

Category : national

తమిళనాడు నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయార్‌లో టీఎన్‌ఎస్‌టీసీ బస్‌ డిపో పైకప్పు కూలి ఎనిమిదిమంది దుర్మరణం చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులతో పాటు, గాయపడినవారిలో బస్ డ్రైవర్స్‌, కండక్టర్స్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విధులు ముగించుకుని, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కాగా కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం పైకప్పు కూలిపోయి ఉంటుందని అన్నారు.