Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్తమ్ కు మరో గండం .. పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తు

Category : state politics

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన, పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అనుసరించింది. ఇక దీని కోసం కాంగ్రెస్ అధిష్ఠానం.. కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 20లోపు అభ్యర్థుల జాబితా పంపాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో..

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం లోక్‌సభ అభ్యర్థుల జాబితా కసరత్తు ఆయనకు కత్తి మీద సాములా మారనుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ఉత్తమ్ పంపితే మరింత రగడ జరుగుతుందో అన్న టెన్షన్ ఉత్తమ్ లో నెలకొంది.

తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి మూటగట్టుకున్న నేపథ్యంలో.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సర్వే సత్యనారాయణ లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం ఉత్తమ్ తీరుపై దుమ్మెత్తిపోశారు. సీట్ల పంపకాలలో, అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సైతం ఉత్తమ్‌కు క్లాస్ పీకినట్టు తెలుస్తోందిఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రతిపాదనలు పంపాలన్న అధిష్టానం ఆదేశంతో.. ఉత్తమ్‌కు మరో అగ్నిపరీక్ష ఎదురవడం ఖాయమనిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థుల జాబితా అనే గండం నుంచి ఆయనెలా బయటపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. హైకమాండ్‌కు అభ్యర్థుల ప్రతిపాదనలు పంపడం ఒకెత్తయితే.. సెంట్రల్ కమిటీ తుదిజాబితాను సిద్ధం చేయడం మరో ఎత్తు. ఆ తుది జాబితా విడుదల తర్వాత..

ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించలేం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీలుగా పోటీ చేసేందుకు చాలామంది ఆశావహులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తుది జాబితాలో ఎవరికి చోటు దక్కకపోయినా మొత్తానికే తేడా రావడం ఖాయం. మరోసారి నిరసనసెగలు భగ్గుమంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారో, అభ్యర్థుల ఎంపిక అనే అగ్నిపరీక్షను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఒకపక్క టీ పిసిసి అధ్యక్షుడు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తొలగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను ఉత్తమ్ పై పెట్టడం ఆయనకు సంకటంగా మారింది.

Related News