అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో రూ 1,000 కోట్లు వాసులు చేసి రికార్డులను సృష్టించింది. ఇప్పటి వరకు చైనా లో అంత భారీ వసూలు చేసిన తొలి భారతీయ చిత్రం ఇదే విశేషం. పైగా చైనాలో వెయ్యి కోట్లు ఆర్జించిన 33వ చిత్రంగా దంగల్ రికార్డు నెలకొల్పింది.
ఓ భారతీయ చిత్రానికి చైనాలో ఇంత ఆదరణ దక్కడం అసాధారణమని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మే5వ తేదీన దంగల్ చైనాలో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఆ దేశంలో దంగల్ వసూళ్లలో టాప్‌లోనే ఉంది.
ఈ సినిమా సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ గల భారతీయ సినిమాగా మారింది. దీనితో అమీర్ ఖాన్ కు సోషల్ మీడియా లో 6.55 లక్షలకు చైనాలో ఫాలోవర్స్ పెరిగారు.
అయితే శుక్రవారం పైరేట్స్ ఆఫ్ కరేబియన్ రిలీజ్ అయిన తర్వాత దంగల్ కలెక్షన్లు పడిపోయి రెండో స్థానంలోకి వచ్చింది. అయినా సినిమాను మాత్రం ఇంకా తొమ్మిది వేల థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.