//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ సింగర్ అరెస్ట్ : రెండేళ్ళ జైలు శిక్ష

Category : national

ప్రముఖ పాప్‌ సింగర్ దలేర్‌ మెహందీకి కోర్టులో చుక్కెదురు అయింది.

గతంలో ఆయన మీద మనుషుల అక్రమ రవాణా అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఇదే కేసు మీద విచారణ చేపట్టిన పాటియాలా కోర్టు దలేర్‌ మెహందీని దోషిగా తేల్చింది. అప్పట్లో ఆయన తన మ్యూజికల్‌ బ్యాండ్ విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేసేప్పుడు అసలు మ్యుజిషియన్ ల తో పాటు మరి కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై కేసు నమోదైంది.

అమెరికా. కెనడాలతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్‌ మనుషులను తీసుకెళ్లినట్టుగా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దలేర్‌ మెహెందీని దోషిగా తేల్చిన పాటియాలా కోర్ట్‌ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తర్వాత ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు.