//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చుక్కలను తాకనున్న పెట్రో ధరలు..!

Category : national

పెట్రో ధరలు చుక్కలను తాకుతాయా ...అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ మంట ఏం చెబుతోంది? బ్యారెల్ 40డాలర్లకి పడినా మనకు రేటు తగ్గలేదు.. మరి గరిష్ఠానికి పెరిగితే బాదేస్తారా? పెద్దనోటు రద్దును మించిన పెను సంక్షోభం రాబోతోందా? దేశీయ పెట్రో ధరలను అంతర్జాతీయ మార్కెట్ కు అనుసంధానించారు...అంటే ముడి చమురు ధర పెరిగితే... ఇక్కడ పెట్రోల్ , డీజిల్ పెరుగుతాయి...తగ్గితే తగ్గుతాయన్నమాట... పెంచినప్పుడు వినియోగదారులను పెట్రో కంపెనీలు బాదేస్తున్నాయి... మరి తగ్గినప్పుడు మాత్రం ప్రభుత్వం పన్నులు పెంచి ...లెవెల్ చేసేస్తోంది. ముడిచమురు ధరల తగ్గింపు బెనిఫిట్స్ ... వినియోగదారులకు చేరడం లేదు. మరి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర... 28 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక్కరోజే ఈ ధర 3.5 శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర 64 డాలర్లు దాటేసింది. వారం రోజుల్లో 70డాలర్లకు చేరిపోయే అవకాశముంది. అదే జరిగితే మన దగ్గర లీటర్ పెట్రోలు, డీజిల్ పై నాలుగైదు రూపాయలైనా పెంచేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవలే మూడి చమురు ధర 50 నుంచి 55 డాలర్లకు పెరగడంతో ఆ ప్రభావం వినియోగదారునిపై పడకుండా... కేంద్రం రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుంది. బ్యారెల్ ముడి చమురు 70 డాలర్లకు చేరువవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారునిపై కనికరించి...పన్నులు తగ్గించకపోతే... బాదుడు ఖాయంలా ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తిచేస్తున్న దేశం సౌదీ అరేబియా. ఇప్పుడు సౌదీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇద్దరు యువరాజులు చనిపోయారు. అవినీతి ఆరోపణలపై డజనుమంది యువరాజులపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాల ప్రభావంతో ముడి చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒక్కరోజే ముడి చమురు ధర రెండున్నర డాలర్లు పెరగడంతో... భవిష్యత్ లో మరింత పైపైకి వెళ్లే అవకాశముందంటున్నారు నిపుణులు. 2015జూలై తర్వాత ...క్రూడాయిల్ కు అత్యధిక ధర ఇప్పుడే పలుకుతోంది. మన దేశంలో చమురు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే చమురు వినియోగం 9.9 శాతం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 74 రూపాయలు.. ఆంధ్రాలో 76 రూపాయలుగా ఉంది. తెలంగాణలో డీజిల్ లీటర్ 63 రూపాయల 29పైసలుకాగా...ఆంధ్రాలో రెండ్రూపాయలు ఎక్కువగానే ఉంది. అంతర్జాతీయ పరిణామాలను చూస్తుంటే ...లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలకు వెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

బ్యారెల్ అరవై డాలర్లు దాటితే వినియోగదారునిపై పెను భారం తప్పదని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. ఎందుకంటే బ్యారెల్ ముడి చమురు 50 డాలర్ల లోపు ఉన్నప్పుడే...మన పాలకులు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించలేదు. నిజానికి మోదీ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వరంలా మారింది. పన్నులు బాదేశారు. ప్రతి ఏటా లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. యూపీఏ హయాంలో ముడి చమురు ధర బ్యారెల్ 130 డాలర్ల వరకు వెళ్లింది... ఆ తర్వాత భారీగా తగ్గినా మోదీ సర్కార్ పన్నులు పెంచి... వినియోగదారునికి మాత్రం ఊరట కలిగించలేదు. క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒక్క డాలర్‌ పెరిగితే భారత దిగుమతుల వ్యయం 133 కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే విత్తలోటు పెరుగుతుంది. ఈ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రభుత్వమే దిగుమతుల భారం భరించి దేశీయంగా ఇంధన ధరలు పెరగకుండా చూడాలి. లేకపోతే సామాన్యుని

నడ్డి విరగడం ఖాయం.

ఇప్పుడు ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండటంతో... కరెంట్ ఖాతా లోటుతో సతమతమయ్యే భారత్ కిది పెనుభారం కానుంది. చమురు ధరలు పెరగడం నేరుగా ధరలపెరుగుదలకు దోహదం చేస్తుంది. రవాణా వ్యయాలు, ముడిపదార్ధాలు, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. పరోక్షంగా ఆర్‌బీఐ వడ్డీరేట్ల పాలసీపై ప్రభావం చూపి, రేట్లు తగ్గకుండా నిరోధిస్తాయి. దీంతో నిధుల ప్రవాహం తగ్గి మూలధన వ్యయాలు గణనీయంగా క్షీణిస్తాయి. ఈ పరిణామం అంతిమంగా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారి తీస్తుంది. క్రూడాయిల్‌ ధరలు క్రమంగా పెరగడంతో సౌదీలో యువరాజుకు కొత్త బలాన్నిచ్చింది. సింహాసనంపై ఆయన క్రమంగా పట్టుబిగిస్తున్నారు. మరోవైపు ఈ కారణంగా సౌదీ, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. క్రూడాయిల్‌ ధరలు మరింత పైకి చేరేందుకు దోహదం చేసేలా ఒపెక్‌ దేశాలు తమ ఉత్పత్తిపై కోత విధించుకున్నాయి. దీంతో అంతర్జాతీయ విపణిలో ముడిచమురుకు డిమాండ్‌ ఊపందుకుంటోంది. పెట్రో ధరల ప్రభావం... స్టాక్ మార్కెట్లపై కూడా పడుతోంది.

పెట్రోల్ లీటర్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో 43 రూపాయలు వెళ్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తీసేస్తే పెట్రోల్ ధర లీటర్ 30 రూపాయలకన్నా తక్కువకే అమ్మొచ్చు. పన్నులు తీసేస్తే లీటర్ డీజిల్ ధర పాతిక రూపాయలే. అంటే ఒక లీటర్ డీజిల్ అమ్మితే ప్రభుత్వాలకు 38

Related News