Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌లోకి రాజ్య‌స‌భ స‌భ్యుడు..!

Category : politics

రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా డైల‌మా కొన‌సాగుతూనే ఉంది. టీఆర్ఎస్ త‌రుపున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా డీఎస్‌పై సొంత పార్టీ నేత‌లే గుర్రుగా ఉన్నారు. నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ బాస్‌కు సైతం కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే, ఇంకా ముహూర్తం మాత్రం ఖ‌రారు కాలేదు.

అయితే, నిన్న డీఎస్ అనుచ‌రులు కొంద‌రు గాంధీ భ‌వ‌న్‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. డీఎస్‌కు అనుకూలంగా నినాదాల‌తో హోరెత్తించారు. అనంత‌రం కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్‌ కాంగ్రెస్‌లోకి రానున్నా ఆయ‌న అనుచ‌రులు పార్టీలో చేర‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మ‌రో ప‌క్క‌, డీఎస్ కూడా అతి త్వ‌ర‌లో టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నార‌న్న ప్ర‌చారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

Related News