Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డి. రామానాయుడి చివరి స్వప్నమే వెంకీ మామ చిత్రమట.

Category : movies

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీ చాలా మంది పెద్ద చిన్న స్టార్ హీరోలతో అనేక మల్టీ స్టారర్ సినిమాల్లో నటించి మెప్పించారు....తెలుగు లో ఉన్న హీరోలలో ఎవరికి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ వెంకటేష్ సొంతం.అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ క్రమం తప్పకుండ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే చాలా కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే పాటల చిత్రీకరణ కూడా మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా సురేష్ ప్రొడక్షన్ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా ఇటీవలే రిలీజ్ చేశారు..

రామానాయుడు గారు బ్రతికున్న రోజుల నుంచే కొడుకుని మనవడిని ఒకే సినిమాలో చూడాలని ఆయనకు ఉండేదట.కాకపోతే ఆ సమయంలో సరైన కథ దర్శకుడు దొరకకపోవడంతో ఆ ఆలోచన ఇప్పటికి కుదిరిందని ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు ఈ సంధర్బంగా గుర్తు చేస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లారు.అప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పటికైనా తన తండ్రి కల నెరవేరింది కాబట్టి ఆయన స్వర్గంలో ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ మరింత సంతోషిస్తుందన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. రానా కూడా ఇదే తరహాలో ఎమోషనల్ గా ఈ పోస్టర్ ని షేర్ చేయడం విశేషం.సురేష్ సంస్థను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కృషి చేసిన రామానాయుడు గారు నిజంగా ఈ కాంబో చూడకుండానే వెళ్ళిపోవడం కొంత వరకు ఆ సంస్థకు ఆ ఫ్యామిలీ కి లోటే అని చెప్పాలి.

ప్రేమమ్ లో ఓ చిన్న సీన్ లో కలిసి నటించడం తప్ప మామ అల్లుళ్ళు మళ్ళి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇన్నాళ్ళకు ఈ ఇద్దరు కలిసి నటించడంతో వారిద్దరి అభిమానులకు ఈ వార్త మరింత జోష్ పెంచింది.ఈ చిత్ర దర్శకుడు బాబీ వెంకీ మామను ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా సెట్ చేశాడు. ఆగస్ట్ లో ఈ సినిమా విడుదల ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో వెంకీ మామ మీద చాలా క్రేజ్ ఉంది. ఈ ఏడాది టాప్ హిట్స్ ఎఫ్-2 మజిలి రెండూ ఈ ఇద్దరి ఎకౌంటులోనే ఉండటంతో బిజినెస్ పరంగా కూడా దీనికి మంచి క్రేజ్ పెరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.చూడాలి మరి టీజర్ తరువాత ఈ సినిమాపై ఇంకెన్ని అంచనాలు నెలకొంటాయి అన్నది.

Related News