//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్థంభించిన జేఎన్పీటీ పోర్ట్ స‌ర్వ‌ర్లు

Category : business

వాన్నాక్రై రాన్స‌మ్ వేర్ వైర‌స్ అటాక్ తో అల్లాడిన ప్ర‌పంచం ఇప్పుడు మ‌రో వైర‌స్ దాడిని ఎదుర్కోవాల్సి వ‌స్తున్న‌ది. ఒక అటాక్ త‌ర్వాత మ‌రో అటాక్ చేస్తూ హ్యాక‌ర్స్ ప్ర‌పంచంలోని ముఖ్య‌మైన‌, ప్ర‌భుత్వ రంగ, ది మోస్ట్ సెక్యూర్డ్ వెబ్ సైట్ల‌ను హ్యాక్ చేస్తూ సైబ‌ర్ ప్ర‌పంచానికే స‌వాల్ విసురుతున్నారు. ఇక‌.. రీసెంట్ గా యూర‌ప్ ను అత‌లాకుతలం చేసిన ది మోస్ట్ డేంజెర‌స్ వైర‌స్ పెట్యా ఇప్పుడు మ‌న దేశంలోకి కూడా చొచ్చుకొచ్చింది. ముంబ‌యి లోని అతి పెద్ద కంటైన‌ర్ పోర్ట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్ర‌స్ట్ కు చెందిన కొన్ని క‌స్ట‌మ‌ర్స్ రిలేటెడ్ స‌ర్వ‌ర్ల‌ను, సైట్ల‌ను హ్యాక్ చేసింది పెట్యా వైర‌స్. దీంతో పోర్ట్ లోని కార్య‌క‌లాపాలు స్థంభించిపోయాయి. జేఎన్పీటీ లో భాగ‌మైన మొల్లెర్ మాయెర్స్క్ లాజిస్టిక్ కంపెనీ కి చెందిన బిజినెస్ యూనిట్స్, సైట్ల‌ను హ్యాక్ చేసింది పెట్యా రాన్స‌మ్ వేర్. దీంతో మాయెర్క్స్ కంపెనీ కి చెందిన స‌ర్వ‌ర్ల‌న్లీ డౌన్ అయ్యాయి. వెంట‌నే రంగంలోకి దిగిన ఎథిక‌ల్ హ్యాక‌ర్స్ పెట్యా రాన్స‌మ్ వేర్ ని స‌ర్వ‌ర్ల నుంచి తీసేసే ప‌నిలో ప‌డ్డారు. పెట్యా అటాక్ తో ఇండియాతో పాటు ర‌ష్యా కు చెందిన ఆయిల్ కంపెనీ రోస్ నెఫ్ట్, అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ డ‌బ్ల్యూపీపీ గ్రూప్, ఉక్రెయిన్ కు చెందిన సెంట్ర‌ల్ బ్యాంక్, ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్ పోర్ట్ స‌ర్వర్లు డౌన్ అయిపోయాయి.