//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దారి మార్చిన సైబర్ నేరగాళ్లు

Category : national

డిజిటల్ లావాదేవీలు మొదలైనాక సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులను దొంగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌, ఈ-బే, పేటీఎం వంటి ఈవ్యాలెట్ల ద్వారా సొమ్మును దొంగిలిస్తుంటే పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఈ సారి దారి మార్చి కొత్త ఈ-వ్యాలెట్ల మీద పడ్డారు.

ఈ-వ్యాలెట్లను ఆశ్రయంగా ఎంచుకున్న సైబర్ నేరగాళ్ళు ఈ సారి ఎవరికి అనుమానం రాకుండా ఈ-వ్యాలెట్ ఖాతాల్లోకి రూ.5వేలు, రూ.10వేలు.. చిన్నమొత్తాలుగా నగదు బదిలీ చేసుకుంటున్నారు.ఇలా బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్‌ నేరగాళ్లు గత నెలరోజుల్లో హైదరాబాదీయుల నుంచి రూ.80లక్షలు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బదిలీ చేసుకున్నారు.అంతేకాదు రెండు మూడు రోజుల్లోనే రూ.2.70 లక్షలు హైదరాబాద్ కు చెందిన ముగ్గురి ఖాతాలనుంచి దొంగలించినట్లు సమాచారం ఉంది.

అసలు సైబర్ నేరగాళ్లు ఈ-వ్యాలెట్‌ నుండి సొమ్మును ఎలా బదిలీ చేస్తున్నారు? డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి స్వాహా చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు పోలీసులకు అనుమానం రాకుండా సొమ్మును తమ ఖాతాల్లో వేసుకోకుండా ఈ-వ్యాలెట్‌లలోకి బదిలీ చేసి ఒకట్రెండురోజుల్లో మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. ఇలా చేసేటపుడు బ్యాంకు నుంచి నగదు ఈవ్యాలెట్‌లోకి వెళ్లకుండా 24 గంటలు ‘గేట్‌వే’ ఆపుతుంది. అపుడు పోలీసులు ఖాతాదారుడు నగదు లావాదేవీ చేయలేదని, బదిలీ చేయవద్దని ఈ-వ్యాలెట్‌కు సమాచారమిస్తున్నారు. దీన్ని గ్రహించిన సైబర్‌నేరగాళ్లు ఈ-వ్యాలెట్‌లలోకి కొంత మొత్తాన్ని బదిలీ చేసుకుంటున్నారు. ‘ఎఫెక్స్‌మార్ట్‌’, ‘హెల్ప్‌చాట్‌’, ‘ఫోన్‌పే’, ‘ఫ్రీఛార్జ్‌’ వంటి పలు ఈ -వ్యాలెట్‌లను నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాదారులారా జాగ్రత్త డిజిటల్ లావాదేవీలలో పడి సైబర్ నేరగాళ్ళు మోసాలకు బలికాకండి !

Related News