//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. రీజన్ ఇదేనా

Category : world

సైబర్ నేరగాళ్లు అభినందన్ మీద ఉన్న అభిమానాన్ని కూడా వాడుకుంటున్నారు. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ పాక్ చెరలో బందీ గా ఉన్నారు. ఆ సమయంలోనూ ఆయన చూపించిన ధైర్యసాహసాలు భారతదేశ ప్రజల గౌరవానికి కారణమయ్యాయి. పాక్ చెర నుండి భారత్ కి చేరిన యుద్ధవీరుడు అభినందన్ కు భారత ప్రజలు జయజయ ధ్వానాలు పలికారు. ఇంకేముంది అభినందన్ పేరుతో సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా అకౌంట్ లు క్రియేట్ అయిపోయాయి.

సోషల్ మీడియాలో అభినందన్ తో టచ్ లో ఉండాలని భావించిన భారతీయులు ఈ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారు. దీంతో సదరు నెటిజన్ల అకౌంట్లు హ్యాక్ కు గురవుతున్నాయి. అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పౌరుల సమాచారాన్ని కొల్లగొడుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్న పౌరుల సమాచారాన్ని దేశద్రోహానికి కూడా వాడే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

దీంతో అప్రమత్తమైన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు సోషల్‌ మీడియాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ వెల్లడించింది. సోషల్ మీడియా యూజర్లు ఎవరూ అభినందన్ పేరుతో ఉన్న అకౌంట్లను ఫాలో కావొద్దని సూచించింది. ఆయన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు అభినందన్ పేరుతో ఉన్న కొన్ని ఫేక్ అకౌంట్లను ఐఏఎఫ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అభినందన్‌ పేరుతో ఫేక్‌ అకౌంట్లు తెరిచి అసత్యప్రచారం చేస్తుండడంతో పాటు సదరు అకౌంట్ ల దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా ఐఏఎఫ్ చర్యలు చేపట్టింది.

Related News