//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Category : business

ఇండియాలో బ్యాంకు లను మోసం చేయడం ఇప్పుడు చాల సర్వసాధారణం అయిపోయింది. మొన్న విజయ్ మాల్యా కొన్ని వేలకోట్లు అప్పు ను ఎగవేత వేసి హాయిగా విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న నిరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ను నిలువునా ముంచి విదేశాలకు పారిపోయాడు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంపై కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల ఖాతాల ఆడిటింగ్‌ విషయంలో ఆర్‌బిఐ వైఖరి పై విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, కుంభకోణాలు బయట పడ్డాక ఆర్‌బిఐ బ్యాంకుల ఆడిటింగ్‌కు పూనుకోవడాన్ని అయన తప్పు పట్టారు. నిర్ణీత కాల వ్యవధిలో ఆర్‌బిఐ ఎప్పటికపుడు బ్యాంకుల ఖాతాలను ఆడిట్‌ చేస్తున్నట్టయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులలో బ్యాంకుల ఆడిటింగ్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం చాల ఉంది అని అయన వ్యాఖ్యానించారు. ఆర్‌బిఐ నిర్ణీత కాలంలో ఎప్పటికపుడు బ్యాంక్‌ ఖాతాలను ఆడిట్‌ చేయాలి. ఆర్‌బిఐ ఆ పద్దతి వదిలేసి కుంభకోణాలు బయటపడినప్పుడు ఆడిట్‌ నిర్వహించే విధానానికి మారింది అని ఆర్బీఐ పై విరుచుకు పడ్డాడు .

ఇది మంచి విధానమే. అయితే నష్టాన్ని నిర్ణయించేందుకు వాళ్లకంటూ కొన్ని ప్రామాణికాలు ఉండాలి. ఆ ప్రామాణికాల ప్రకారమే ఆర్‌బిఐ ఆడిటింగ్‌ నిర్వహించాలి. పిఎన్‌బిలో కుంభకోణం జరిగినన్నాళ్లూ అసలు ఎలాంటి ఆడిటింగ్‌ జరిగినట్టు కనిపించడం లేదు అని తేల్చి చెప్పారు.

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణ ముమ్మాటికీ ఆర్‌బిఐదేనని సివిసి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆర్‌బిఐ చిత్తశుద్ధి ఏ మాత్రం లోపించినట్టు కనిపించినా సివిసి ఆ విషయాన్నీ పరిశీలిస్తుందన్నారు. నీరవ్‌ మోదీ తరహా కుంభకోణాలు ఒక్క పిఎన్‌బికే పరిమితం కాకపోవచ్చని కూడా సివిసి చెప్పారు. ఇతర బ్యాంకుల్లో ఇలాంటి కుంభకోణాలు లేవని నూరు శాతం నమ్మకంతో చెప్పలేమన్నారు.

బ్యాంకింగ్‌ రంగంలో కుంభకోణాలు తలెత్తినపుడు అందరినీ నిందించడం సరికాదని కూడా సివిసి చెప్పారు. ఇది సంస్థాగత సమస్య. ఏటా లేదా రెండు, మూడు, నాలుగేళ్లకు ఒకసారి బ్యాంకులను ఆడిట్‌ చేయాలి. దీన్ని పక్కన పెట్టి రిస్క్‌ ఆధారంగా కుంభకోణాలు తలెత్తే అవకాశం ఉన్నపుడే బ్యాంకు ఖాతాలను ఆడిట్‌ చేయాలని ఆర్‌బిఐ నిర్ణయించింది అన్నారు.