Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ కొత్త చట్టం : బ్యాంకులో మీ సొమ్ము భద్రమేనా లేక వెనక్కి తెచ్చేసుకోవాలా !

Posted a month ago | Category : national

కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్‌ (2017)’ సెగ వరంగల్‌ను తాకింది. ‘మోదీ కొత్త చట్టం తెస్తున్నాడటగా, బ్యాంకుల్లో మన డబ్బుల్ని ప్రభుత్వమే వాడేసుకుంటుందటగా’ అంటూ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుల ముందు పోటెత్తారు.

అలాంటిదేమీ లేదని బ్యాంకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. అధిక శాతం ఖాతాదారులు ‘మీరు చెప్పింది నిజమైతే తర్వాత మళ్లీ డిపాజిట్‌ చేస్తాం. ఇప్పుడు మాత్రం తీసుకోనివ్వండి’ అంటూ బదులివ్వడం గురవారం పలు బ్యాంకుల వద్ద కనిపించింది. వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట ప్రాంతాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.వరంగల్‌లోని కొన్ని బ్యాంకుల్లో ప్రజలు వరుసలో నిలబడి డిపాజిట్‌లు వెనక్కి తీసుకున్నారు.

విషయం బయటకు పొక్కితే బ్యాంకులన్నీ డిపాజిట్‌లు విడిపించుకునే ఖాతాదారులతో నిండిపోతాయని భయపడుతున్నారు బ్యాంక్ అధికారులు. బ్యాంకుల్లో డిపాజిట్లు వెనక్కి తీసేసుకుంటున్నవారిలో ఎక్కువ మంది.. దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలేనని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బిల్లు రాక ముందే దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారం వల్ల ఖాతాదారులు కొంత అయోమయం పాలవుతున్నారు. కొద్దిమంది మాత్రం విత్‌ డ్రా చేసుకుంటున్నారు. ఖాతాదారుల డబ్బుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మద్దు అంటూ బ్యాంకు అధికారులు మోర పెట్టుకుంటున్నారు.

బ్యాంకుల్లో సొమ్ము భద్రం కాదా..? అసలు ఈ ప్రచారంలో నిజమెంత ?

ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ అంటే ఏంటి ఇప్పుడు బాగా కలకలం రేపుతోన్న అంశం. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే, ఇక డబ్బులు ఎప్పుడైనా వాళ్లే వాడుకుంటారట కదా  అనే విధంగా ప్రచారం జరుగుతోంది కూడా! 

అప్పుడే ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ పిటీషన్లు కూడా తయారవుతున్నాయ్. కేంద్రం ఎంతగా సర్దిచెప్పాలని చూస్తున్నా, జనంలో ఆందోళన మాత్రం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. change.org లాంటి ఆన్ లైన్ పిటీషన్లకి ఇప్పటికే మద్దతుగా 70వేలమందికి పైగా సంతకాలు చేయడం ఈ ఆందోళన ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అమాయకులైన జనం డబ్బులను మీ అవసరాలకోసం వాడేసుకోవద్దు ('Do not use innocent depositors' )అనే టైటిల్‌తో ఈ పిటీషన్ సర్క్యులేట్  అవుతోంది.

ఈ బిల్లుతో బ్యాంకులు దివాలా స్థితికి చేరినప్పుడు డిపాజిటర్ల అనుమతితో సంబంధం లేకుండానే వారి డబ్బుని వాడుకునేలా వెసులుబాటు కలుగుతుంది. ఇదీ జనంలో ఉన్న అభిప్రాయం.బెయిల్ ఇన్ అనే సవరణతో ఈ FRDI బిల్లు రాబోతోంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో లోక్‌సభలో ఈ బిల్లు జాయింట్ కమిటీ ముందుకు వెళ్లింది. ఈ చలికాల సమావేశాలకు పార్లమెంట్ ముందుకు రావాల్సి ఉఁడగా..సెషన్ల వాయిదాతో వాయిదా పడింది. ఈ బిల్లు ఆమోదం పొందితే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు అవుతుంది. అది  ఆర్ధికసేవలందించే సంస్థల ఆస్తులను బదిలీ చేయడం లేదంటే విక్రయించే హక్కులు దఖలు పడతాయి.

ఐతే ఈ కార్పోరేషన్ ఏర్పాటు వలన  బ్యాంకుల ఆర్ధిక స్థితి బాలేని పరిస్థితుల్లో బ్యాంకుల్లోని డిపాజిట్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం కలుగుతుంది. ఐతే లక్షరూపాయలు దాటిన డిపాజిట్లకు మాత్రమే ఇప్పటిదాకా ఇలాంటి బీమా సౌకర్యం ఉంది. ఐతే బెయిల్ ఇన్ నిబంధన వలన బ్యాంకుల అప్పులు  రద్దు కావడంతో పాటు, ఆస్తుల బదిలీకి కూడా వీలు కలుగుతుంది. ఇదే ఇప్పుడు డిపాజిటర్లలో అనుమానానికి తావిస్తోంది. ఐతే కేంద్రం మాత్రం ఇప్పటికే ఉన్న రక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుందే తప్ప జనం డబ్బులు పోతాయనే వాదనకి అర్ధం లేదని చెప్తోంది. 


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !