పశుమాంసంపై దేశంలో ఆంక్షలు పెరుగుతూ ఉండడంతో చికెన్ కు గిరాకీ పెరుగుతున్నది. అసోచామ్ అంచనా ప్రకారం దేశంలో ఇప్పటికే 25 నుండి 30 శాతం మేరకు వినియోగం పెరిగింది. చికెన్ ధరలు కూడా 40 శాతం మేరకు పెరిగాయి. పౌల్ట్రీ టోకు ధరల సూచిక కూడా మార్చ్ నుండి మే వరకు 22 శాతం పెరిగింది.
మే, 2014 నుండి మార్చ్, 2017 వరకు పౌల్ట్రీ టోకు ధరల సూచిక 22 శాతం పెరుగగా, పశుమాంసం 3 శాతం తగ్గింది. గత కొద్దీ సంవత్సరాలుగా చికెన్ వార్షిక వృద్ధి రేట్ 10 నుండి 12 శాతంగా ఉంటూ ఉండగా, పశుమాంసం వృద్ధి 15 నుండి 18 శాతం ఉంటూ వస్తున్నది. అంతకు ముందు జూన్ 2013 నుండి మే 2014 వరకు పశుమాంసం టోకు ధరల సూచికలో 10 శాతం పెరుగుదల ఉండగా, చికెన్ లో 9 శాతం మాత్రమే ఉంది.
పశుమాంసంకు సంబంధించి ప్రస్తుతం దేశంలో తలెత్తుతున్న వివాదాలు ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రం, పంజాబ్, తమిళ్ నాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వంటి కీలక ఆప్రాంతాలలో పౌల్ట్రీ పరిశ్రమకు వరప్రసాదంగా మారింది. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అవకాశం ఉండడమతొ ఈ పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందగలదని భావిస్తున్నారు.